చంద్రబాబు పాలన మొదలైన నాటి నుంచి తిరుమల కొండ మీద అపచారాలు జరగని రోజంటూ లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబు అనుచరుడు వెంకన్న చౌదరి తిరుమల సాంప్రదాలకు తిలోదకాలిచ్చేశారు. భక్తులు సాంప్రదాయ వస్త్రాల్లో శ్రీవారిని దర్శించుకోవాలని నిబంధనలున్నా.. ప్యాంటు టీ షర్టు ధరించి వచ్చిన మహిళను దర్శనానికి ఎలా పంపారో తెలియడం లేదు. అంటూ ఆ ఫోటో చూపిన టీటీడీ మాజీ ఛైర్మన్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి సన్నిధి వరకు నడుచుకుంటూ వెళ్తుంటే అడ్డుకోకుండా విజిలెన్స్ నిద్రపోతుందా? అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.
ఇంకా ఇటీవలే తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. కొండమీద బిల్డింగ్ పైనుంచి జారిపడి బాలుడు మరణించాడు. నాలుగు మాడ వీధుల్లో ఉద్యోగులే చెప్పులేసుకుని తిరుగుతున్నారు. కొండ మీద రాంభగీచ గెస్ట్‌హౌజ్‌లో చికెన్, మటన్ బిర్యానీ తింటున్నారు. మందు తాగుతూ మందు బాబులు కనిపిస్తున్నారు. ఎర్ర చందనం దొంగలు ఇప్పటికే నాలుగు సార్లు పట్టుబడ్డారు. దీనికి సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమ నిర్మాత పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.