అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాల్వలోకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వాహనంలో మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎందరున్నారు, ఎవరనే విషయాలపై అనకాపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa