ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధి వినాయక గుడి.. ఇకపై అలాంటి బట్టలు ధరిస్తే ఆలయంలోకి నిషేధం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 10:35 PM

మహారాష్ట్రలోని ముంబై ప్రసిద్ధ ఆలయమైన సిద్ధి వినాయక ఆలయం అధికారులు.. డ్రెస్ కోడ్‌ను అమలు చేశారు. అలయానికి వచ్చే వారందరూ పద్ధతైన బట్టల్లోనే వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు అందరూ.. టోన్ జీన్స్, స్కర్ట్స్, షార్ట్స్ వేసుకోవడాన్ని నిషేధించారు. ఒంటిపై ఎక్కువ భాగాలు కనిపించేలా ఉన్న ఇతర రకాల దుస్తులు వేసుకున్నా ఆలయంలోకి అనుమతించమని చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా భక్తులు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రత్యేక పూజల సమయంలోనూ పలువురు భక్తులు అభ్యంతరక బట్టలు వేసుకు వస్తున్నారని చెప్పారు. దాన్ని చూసిన అనేక మంది భక్తులు అసహనం వ్యక్తం చేశారని.. వారి ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని.. ఆలయ పవిత్రను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి ముంబైలోని ఈ అలయానికి వెళ్లాలనుకునే భక్తులు అంతా కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించుకుని.. పద్ధతైన బట్టలు ధరించే స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. పొరపాటును పొట్టి బట్టల్లో వెళ్తే.. ఆలయ దర్శనానికి అనుమతి లభించదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com