ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు ఉపాధి కల్పించడమే సీడాప్‌ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 12:29 PM

భవిష్యత్‌ బిజినెస్‌ లీడర్లను తయారు చేయడమే లక్ష్యంగా సీడాప్‌ అడుగులు వేసింది. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎస్బీ)తో 24 సెక్టార్లకు ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని సీడాప్‌ కార్యాలయంలో గురువారం సీడాప్‌ చైర్మన్‌ జి.దీపక్‌రెడ్డి, ఐఎస్బీ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐఎస్బీతో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకున్నామన్నామని ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి తెలిపారు. వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నినాదంతో ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు.


ఐఎస్బీతోనే కాకుండా సెంచూరియన్‌ యూనివర్సిటీతో ్జకూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దీనివల్ల 40 శాతం శిక్షణ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో రాబోయే మూడేళ్లలో 22 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐఎస్బీ ప్రతినిధి డాక్టర్‌ చందన్‌ చౌదరి మాట్లాడుతూ తయారీ రంగంలో లీడర్స్‌ను తయారు చేసేందుకు ఈ ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఉద్యోగ సృష్టి, ఎగుమతిని పెంచడానికి తయారీ రంగం వృద్ధిని పెంచాలన్నారు. కార్యక్రమంలో సెంచూరియన్‌ యూనివర్సిటీ ప్రతినిధి జేఎం రావు, ఐఎస్బీ ప్రతినిధి డాక్టర్‌ యుగల్‌ నౌహ్రియా, సీడాప్‌ సీఈవో పి.నారాయణ స్వామి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com