తమకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ తాత్సారం చేస్తున్నారని గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ శానిటేషన్ సఫాయి మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అన్నే నరసింహరావు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద సఫాయి మహిళ కార్మికులు సమ్మెను చేపట్టారు. రెండు నెలలుగా తమకు జీతాలు చెల్లించాలని, మూడేళ్లుగా పీఎ్ఫలు కడుతున్నట్టు కాంట్రాక్టర్ మోసం చేస్తున్నాడని, వెంటనే జమచేయాలని వారు డిమాండ్ చేశారు. ‘కాంట్రాక్టర్ రెండు నెలలు నుంచి జీతాలు చెల్లించడం లేదు. రూ.10వేలు జీతం ఇస్తామని చెప్పి, పీఎ్ఫలు కడుతున్నామని మోసం చేసి రూ.8వేలే చెల్లిస్తున్నాడు. తక్షణమే బకాయి ఉన్న రెండు నెలల జీతం ఇవ్వాలి. పీఎ్ఫలను కట్టించి, రూ.18వేలు జీతం చెల్లించాలి. లేకుంటే సమ్మెను ఉదృతం చేస్తాం.’ అని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు గూడపాటి ప్రకా్షబాబు, మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, కార్యదర్శి చింతలూరి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వడ్డాది రమణమ్మ, కనుమూరి విజయలక్ష్మి, వేల్పుల ధనలక్ష్మి, మాతంగి మేరిమ్మ, దొండపాటి పద్మావతి పాల్గొన్నారు.