పెనుకొండ మండలంలోని మావటూరు గ్రామంలో శుక్రవారం రఘురాం తన కుమారుడు మరణ ధృవీకరణ పత్రం కోసం పురుగు మందు డబ్బాతో కుటుంబ సభ్యులతో కలసి గ్రామ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్బంగా రఘురాం పురుగులు మందు డబ్బాను చేతిలో పట్టుకొని తన సమస్య పరిష్కారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం ముందు బైఠాయించారు. అయన మాట్లాడుతూ రోజుల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa