పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వెల్లడించారు. రూ.లక్ష కోట్ల పట్టణ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నిధి ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధితోపాటు ఆపత్కాల పరిస్థితుల్లో పట్టణ ప్రజల బాగోగులను చూసుకునేందుకు వినియోగిస్తామన్నారు. ఈ నిధి ద్వారా పట్టణ జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.