బడ్జెట్‌లో కొత్త ఉడాన్ పథకం ప్రకటించారు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
బీహార్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పాట్నా విమానాశ్రయం విస్తరణ, మరో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.