నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ పై మధ్యతరగతి వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేశారు.గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును పెంచారు. ఈసారి కూడా దానిని పెంచడం గురించి చర్చ జరుగుతోంది. కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిన తీరును బట్టి, కొన్ని ఆకర్షణీయమైన ప్రకటనలు వెలువడించారు. కొత్త పన్ను విధానంలో మధ్యతరగతి వారికి ఆదాయపు పన్నులో భారీ పొదుపు లభించింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఇప్పుడు రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ప్రకటించారు.రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవ్వనున్నాయి. ఇతర పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు అవకాశం ఉంది. అలాగే వచ్చేవారం పార్లమెంట్ ముందకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు.. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు.. స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డులు.. 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్నుల తగ్గింపు అందజేస్తామన్నారు.
BNS స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తామన్నారు. లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం ఉంటుందన్నారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం.. TDSపై మరింత క్లారిటీ ఇస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగిస్తామన్నారు.