ఈనెల 8వ తేదీన భీష్మ ఏకాదశి, 12వ తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల సౌకర్యాల కల్పనపై శుక్రవారం అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా భీష్మ ఏకాదశి పర్వదినాన సుమారు 80వేల మంది భ క్తులు విచ్చేస్తారని, 12 నుంచి 15 వేలు వ్రతాలు జరుగుతాయని అంచనా వేస్తూ దానికణుగుణం గా ఏర్పాట్లపై దృష్టిసారించారు. అర్ధరాత్రి 12 గంటలకు వ్రతం టిక్కెట్లు విక్రయించి ఒంటి గంట నుంచి వ్రతాలు, రెండు గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించారు. కార్తీకమాసంలో రద్దీకి తగినట్టు చేసిన ఏర్పాట్లకంటే మిన్నగా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాలన్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ వ్యవస్థ ఉండేలా చూడాలని ట్రాఫిక్‌ను సత్యగిరి కొండపైకి మళ్లించి ఉచిత వాహనాల ద్వారా భక్తులను రత్నగిరికి చేర్చాలని నిర్ణయించారు. ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా క్యూ లైన్లు పటిష్టపరిచి, ఎక్కడికక్కడ హోల్డింగ్ పా యింట్లను ఏర్పాటుచేసి రద్దీ ఆధారంగా క్యూలై న్ల్ ద్వారా భక్తులను వ్రతాలు, దర్శనాలకు అను మతించాలని నిర్ణయించారు. సిబ్బంది అంతా సమన్వయంతో ముందుకెళ్లాలని ఈవో సూచించారు. భక్తులకు ఉచిత పులిహోర, దద్దోజన ప్రసాదాన్ని ఉదయం 8గంటల నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ వ్యక్తుల దర్శనాలు, సామాన్య భక్తుల దర్శనాలు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, ఎస్‌ఐ హరిబాబు, సర్పం చ్ కుమార్‌రాజా, దేవస్థానం ఏఈవోలు కొండలరావు, కృష్ణారావు, జగ్గారావు, సూపరెంటెండెంట్‌లు బలువు సత్యశ్రీనివాస్, అనకాపల్లి ప్రసాద్, ఐవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.