చదువుకునేందుకు ఐర్లాండ్ దేశం వెళ్లిన జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు, గుంటూరుకు చెందిన మరో యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఐర్లాండ్‌లోని కార్లో పట్టణంలో సౌత్‌ఈ్‌స్ట టెక్నలాజికల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు మూడేళ్లక్రితం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్(25) వెళ్లాడు. ఆ దేశ కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 1.15 గంటలకు తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో చె ట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని తండ్రి సాయిబాబుకు అక్కడ యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చింది. ఈ సమయంలో ఐర్లాండ్‌లో విపరీతమైన మంచు కురుస్తుందని, చెట్టును గుర్తించక ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో భార్గవ్(25)తోపాటు గుంటూరుకు చెందిన చెరుకూరి సురేష్(25) మృతి చెందినట్టు సమాచారం అందింది. కారులో ప్రయాణిస్తున్న వీరి స్నేహితులు ఒక యువ తి, మరో యువకుడు తీవ్రగాయాలతో బయటపడ్డారు. వారికి ప్రాణాపాయం లేదని తెలుస్తుంది.ప్రమాదం విషయం తెలియగానే భార్గవ్ బంధువులు ఐర్లాండ్ నుంచి భౌతికకాయాన్ని తెప్పించాలంటూ టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను కలిశారు. ఆయన వెంటనే మంత్రి నారా లోకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఐర్లాండ్‌లో భారత రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ దేశంలో లాంఛనాలు త్వరితగతిన పూర్తిచేసి భౌతికకాయాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.