రహదారి నియమాలు పాటించకుంటే యమధర్మరాజు వస్తాడని ఆదోని పోలీసులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకి పెరిగిపోతున్న ప్రమాదాలను నివారించేం దుకు యమధర్మరాజు, చిత్ర గుప్తుడి వేషధారణతో ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ డ్రైవింగ్ నేరమని, చిన్నపాటి నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిపారు. జరిమాన విధిస్తున్నా, కౌన్సెలింగ్ ఇచ్చినా నిర్లక్ష్యంగా ఉండి, ప్రాణాలు కోల్పోతున్నాడని డీఎస్పీ హేమలత అన్నారు. సీఐలు గంట సుబ్బారావు, సూర్యమోహన్ రావు పాల్గొన్నారు.