ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజన పథకం ఆహారంలో నాణ్యత లోపిస్తే సహించబోమని ఆ పథకం అడిషనల్ డైరెక్టర్ వెంకట్రా జు అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా , గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యా హ్న భోజన పథకాన్ని ఆయ న శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంటలు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస రావు, హెచ్ఎం సోమరాజు, ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు.