కాకినాడ జిల్లా వాకలపూడి ఏడీబీ రోడ్డులో కంట్రోల్ ఆల్డ్ పిక్స్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఆటోమేటెడ్ సామర్థ్య పరీక్షల సెంటర్ (ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్)ను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు చెరుకూరి కిరణ్, పొట్లూరి బుజ్జిబాబు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రోడ్డు ట్రాన్స్‌పోర్టు వాహనాలు పూర్తి ఫిట్‌గా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ వెహికల్ ఫి ట్‌నెస్‌స్టేషన్లు మంజూరు చేసిందన్నారు. ఇందు లో ఏపీలో 22 సెంటర్లు మంజూరు కాగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి, రాజమహేంద్రవరంతో పాటూ వాకలపూడిలో ఆటోమేటెడ్ టెస్టి ంగ్ సెంటర్లు ప్రారంభించడం జరిగిందన్నారు.
ఒకేసారి 4 వాహనాలకు టెస్టింగ్ సామర్థ్యంతో ఈ సెంటర్ ప్రారంభించామన్నారు. ఒక్కో వా హనానికి 20 నిమిషాల సమయం పడుతుందన్నారు. టెస్టింగ్ అనంతరం ఆన్‌లైన్‌లో జారీ చేసిన సర్టిఫికెట్‌ను యాజమానికి అందివ్వడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వాహనాలకు సుమారు 36 రకాల ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన అనుమతులను కేంద్రం నుంచి పొందడం జరిగిందన్నారు. కార్యక్రమం లో జీజీహెచ్ సలహా మండలి సభ్యులు మేకా లక్ష్మణరావు, ఆదినారాయణ, మీసాలరాజు, ప లువురు వాహన యాజమానులు పాల్గొన్నారు.