వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్క రించుకుని పీలేరులోని అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి పట్టువసా్త్రలు సమరించారు. ఈ సందర్భంగా పలువు రు ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ కోరిక అయిన అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు అంగీక రించడం ఎంతో సంతోషకరమన్నారు. ఆయన పెనుగొం డలోనూ, స్థానిక ఎమ్మెల్యే పీలేరులోనూ అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పిచడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అమ్మ వారి మూలవిరాట్‌కు బంగారు చీరను అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం మహిళలు ప్రత్యేక భజనలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు బలసా వేణుగో పాల్, కూనా సత్యం, ఎర్రయ్య శెట్టి, రేవూరి సుధీర్, జూటూ రు అరవింద్, శ్రీపురం వెంకటేశ, విజయమహేశ, పామిడి మహేశ, సీఆర్ రాజేశ పాల్గొన్నారు. వాల్మీకిపురం పట్టణంలో ని బజారు వీధిలో వెలసిన కన్యకాపర మేశ్వరి దేవి అమ్మ వారి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మండలంలోని చింతపర్తిలో కూడా అమ్మవారి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఈకార్యక్రమాలలో మాజీ మార్కెట్ చైర్మన కంభం నిరంజన రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, నాయకు లు కృష్ణారెడ్డి, రాజేంద్రాచారి, చంద్రమౌళి, పీవీ నారాయణ, ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు తబ్జుల సతీష్, కాంతరాజు, రామ్మోహన, పాల్గొన్నారు. మదనపల్లె పట్టణం లో కన్యకా పరమేశ్వరీదేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్య క్షుడు పూనగంటి ఓంప్రకా ష్ ఆధ్వర్యంలో శుక్ర వా రం వైభవంగా నిర్వహిం చారు. ఇందులో భాగంగా దేవ ళంవీధిలోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆల యం నుంచి కన్యకలు, దంపతులు పాల్గొని గంగ ను తెచ్చి కన్యాకా పరమే శ్వరీ అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం కలశ పూజ, విశేషాలంకరణచేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిం చారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్యవైశ్యసంఘం కార్యదర్శి సురేగిరధర్, ఉపాధ్య క్షుడు దేవతా సతీష్, తదితరులు పర్యవేక్షించారు.