ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడు లోపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షుడు మినహా మిగతా ఎవరైన పార్టీ పదవులు మూడేళ్లకు మించి ఉండకూడదన్న అంశంపై పాలిట్ బ్యూరో ప్రతిపాదించే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లేలా కార్యచరణ చేపట్టనున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అశోక్ బాబు, షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.