ఎన్డీయే 3.0 ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ కేంద్ర బడ్జెట్ లో మన పొరుగున ఉన్న పలు చిన్న దేశాలకు కూడా కేటాయింపులు చేశారు. అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు కేటాయించారు. మాల్దీవులకు రూ.600 కోట్లు, బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు కేటాయించారు. కాగా, మాల్దీవులకు గతేడాది బడ్జెట్ లో రూ.470 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులు పెంచారు