నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వినిపించలేదని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపించారు. విభజిత రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదని, అమరావతి, రైల్వే జోన్, మెట్రో రైల్, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.
టీడీపీకి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం భారీగా కేటాయింపులు చేస్తుందని, ఏపీపై మాత్రం వివక్ష చూపుతుందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు.