ఫిబ్రవరి 5న వైయస్ఆర్‌సీపీ తలపెట్టిన 'ఫీజుపోరు' కార్యక్రమానికి విద్యార్థులు, పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు పోస్టర్లను వైయస్ఆర్‌సీపీ నేతలు విడుదల చేస్తున్నారు. శనివారం చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వైయస్ఆర్ జిల్లాలో మాజీ మంత్రి అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి, గుంతకల్‌లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైయస్ జగన్ వచ్చాక నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైయస్ఆర్‌సీపీ ఉంటుంది. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తామని వారు హెచ్చరించారు.