తాజా చికెన్ ముక్కలు గులాబీ రంగులో ఉంటాయి. నిల్వ ఉంచిన చికెన్ అయితే ఫంగస్ చేరడం వల్ల కొంచెం పసుపు రంగులో కనిపిస్తుంది. చికెన్‌ని తెచ్చినప్పుడు తేదా వంట చేసే వేళ కుళ్లిన వాసన వస్తే అది ఖచ్చితంగా పాడైపోయిందని అర్థం. అలాగే చికెన్‌ను తాకడం ద్వారా కూడా అది మంచిదో కాదో తెలుసుకోవచ్చు. చికెన్ సహజంగా జిగటగా ఉంటుంది. నీళ్లలో కడిగాక కూడా ఎక్కువగా జిగటగా అనిపిస్తే, అది దాదాపుగా చెడిపోయిందని చెప్పొచ్చు.