రాజమండ్రిలోని గౌతమీ ఘాట్ వద్ద గల శ్రీ వాసవి విశ్వరూప శ్రీ చక్ర మహల్ నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.