ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్ లిఫ్టులో ప్రయాణికులు చిక్కుకున్నారు. ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది లిఫ్టు ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్టు ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు రాగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.