వైసీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం దశాబ్దం కాలం కంటే ఎక్కువే. వైసీపీ పెట్టిన వెంటనే అందులో చేరి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ కోసం తన ఆస్తులను అమ్ముకున్నానని కానీ రాజకీయంగా తాను పూర్తిగా ఇబ్బందులే ఎదుర్కొన్నానని అంటున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తాను చేరి సర్వస్వం కోల్పోయాని అన్నారు. తాను మళ్ళీ రాజకీయంగా వైభవం చూస్తున్నాను అంటే అది జనసేన వల్లనే అని పేర్కొన్నారు.