రానున్న వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్ర పున:ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలు నడిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయి ఇరుదేశాల మధ్య బంధాలు బలపడటానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020లో ఆగిన యాత్ర తిరిగి ప్రారంభమవనుంది.