అల్లూరి జిల్లా పాడేరు పర్యటక కేంద్రం పరిధిలోని వంజంగి మేఘాల కొండపై నుంచి బుధవారం ఓ టూరిస్ట్ కింద పడిపోయాడు. అస్వస్థతకు గురైన అతడు కిందకు దొర్లుకుంటూ వచ్చాడు. గాయాలు తీవ్రంగా ఉండడంతో వెంటనే స్థానికులు సహాయం అందించి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పర్యాటకుల కోసం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa