భారత్ మోస్ట్ వాటెండ్ టెర్రరిస్టు, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. దేశంలో అనేక ఉగ్రదాడులకు ప్రధాన కారకుడైన మసూద్ ఆచూకి కోసం భారత్ కొన్నాళ్లుగా వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల పూల్వామాలో భారత్ జవానులపై జరిగిన ఆత్మహుతి దాడి వెనుక కూడా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే ఉంది. ఈ దాడికి తామే పాల్పడ్డామని ఈ సంస్థ ప్రకటించుకున్న విషయం విదితమే. పాక్‌లోనే మసూద్ అజర్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఇన్నాళ్లు ఇతను తమదేశంలో లేడని బుకాయిస్తూ వచ్చింది. అయితే పూల్వామదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సమయంలో మళ్లీ మసూద్ విషయం తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు ఇతని గురించి తెలియదని బుకాయించిన పాకిస్తాన్ రెండు రోజుల కిందట మసూద్ మా దేశంలో ఉన్నాడని ప్రకటించింది. అయితే అతను ఇంట్లో నుంచి కదిలేస్థితిలో కూడా లేడని తెలిపింది. మసూద్ అజర్ కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే లివర్ సంబంధిత సమస్యతో ఉన్న మసూద్‌కు పాక్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇతను మార్చి 2వ తేదీన ఈ ఆసుపత్రిలో చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం అధికారికంగా దృవీకరించలేదు.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్:మసూద్ అజర్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. కొన్నాళ్లుగా పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లో పనిచేస్తున్న మసూద్ జిహాద్ పేరుతో ఇండియా మీద, భారత సైన్యం మీద ఎన్నో దాడులు చేయించాడు. గతంలో దొంగ పత్రాలతో భారత్‌లో అడుగుపెట్టాడు. అయితే, అతడిని భారత బలగాలు అదుపులో తీసుకున్నాయి. అతడిని విడిపించేందుకు టెర్రరిస్టులు ఏకంగా విమానాన్ని హైజాక్ చేశారు. 1999లో కాందహార్ విమానం హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్, అనుచరులను విడిచిపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa