ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్ -16 దుర్వినియోగంతో ఇరకాటంలో పాకిస్థాన్

international |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 07:19 PM

దిల్లీ....ఎఫ్ -16 విమానాల దుర్వినియోగంతో పాక్ ఇరకాటంలో పడింది. ఎఫ్ -16లపై అమెరికా దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పుడు గనక రాఫెల్ ఉండిఉంటే...అని మోడీ తెలిపారు. శనివారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌-2019లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. ‘రఫేల్‌ జెట్‌ విమానాలు భారత్‌లో లేకపోవడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రఫేల్‌ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని భారత ప్రజలందరూ అనుకుంటున్నారు’ అని మోదీ అన్నారు. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తు... రఫేల్‌ భారత్‌కు రాకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని మరోసారి రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. రఫేల్‌ విమానాలు దేశంలో లేకపోవడం వెలితిగా ఉందన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘డియర్‌ పీఎం..మీకు అవమానంగా అనిపించడం లేదా?మీరు రూ.30,000కోట్లు కొల్లగొట్టి ఆ డబ్బును మీ స్నేహితుడు అనిల్ అంబానీకి ఇచ్చారు. రఫేల్‌ రాక ఆలస్యం కావడానికి మీరొక్కరు మాత్రమే కారణం. పనికి రాని విమానాలను రప్పించి జవాన్ల ప్రాణాలను ఇరకాటంలో పెడుతున్నారు. పైగా వింగ్‌ కమాండర్‌ అభినందన్‌లాగా ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నారు’ అని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa