సినీ హాస్య నటుడు అలీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నారని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు అందజేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఆయన అభ్యర్థనను పరిశీలించిన అధికారులు ఆయనకు హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని చెప్పారు. ఇందుకు ఆయన తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించినా పరవాలేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలన్నారు. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు పలువురి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు తెనాలి నుంచి ఆళ్లపాటి రాజా పేరు దాదాపు ఖరారైంది. గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానానికి సినీనటుడు అలీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa