చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్‌ను నిలదీసేందుకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సూపర్ సిక్స్ మోసాలు, మున్సిపల్, కార్పోరేషన్ పదవుల ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలు సహా ఇంకొన్ని అంశాలపై మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
మరీ ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనలో ఉన్న శ్రేణులకు వైయస్ జగన్ ధైర్యం చెబుతున్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని.. ఎవ్వరికి ఏ ఇబ్బందులు వచ్చినా తన జీవితాన్ని గుర్తుతెచ్చుకోవాలని ఆయన భరోసా ఇస్తూ వస్తున్నారు. అదే సమయంలో.. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈసారి జగనన్న 2.O వేరుగా ఉంటుందని తాజాగా విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ్టి ప్రెస్‌మీట్‌పై ఆసక్తి నెలకొంది.