బైక్ ప్రమాదాల నివారణకు టీచర్ విజయభార్గవి విద్యార్థులతో కలిసి వినూత్న ఆవిష్కరణ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆమె స్మార్ట్ హెల్మెట్ ను గురువారం తయారు చేశారు.
ఈ హెల్మెట్ ధరించకపోయినా, మద్యం తాగి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవ్వదు. ఎక్కడైనా ప్రమాదానికి గురైతే ఆ సమాచారం కుటుంబ సభ్యులకు వెళ్తుంది. ఈ హెల్మెట్ పని తీరు గురించి పై వీడియోలో చూడొచ్చు.