జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలను బుద్దా వెంకన్న ఖండించారు.
జగన్ 2.0లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. జగన్ పరిపాలన నచ్చక ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, జగన్ భ్రమల్లో నుంచి బయటికి రావాలని పేర్కొన్నారు.