అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో బంగారు ఆభరణాలను మెరుగుపెట్టామంటూ మోసానికి పాల్పడుతున్న దిలీప్‌ను గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. బిహార్‌కు చెందిన అతను, గంగమ్మ వద్ద 35 గ్రాముల బంగారు గొలుసును మెరుగుపెట్టి, అది 25 గ్రాములకు మాత్రమే మారింది.
మోసగాడిని స్థానికుల సాయంతో అగళికి తీసుకెళ్లి, ఎస్సై శ్రీరాములుకు అప్పగించారు. పోలీసులకు విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని స్థానిక నాయకులు కోరారు.