ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 03:47 PM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. గతంలో పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టు సమాచారం. ఇక, మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com