అనంతపురం న్యూటౌన్ జూనియర్ కళాశాలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు.
అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడకుండా మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.