ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీ రూపొందిస్తూ నిర్ణయం తీసుకుంది.
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల టెండర్ లను రద్దు చేసి కొత్త టెండర్ లను పిలిచే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది.
![]() |
![]() |