ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూపురం వైసీపీలో టెన్షన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 01:32 AM

సార్వత్రిక ఎన్నికు సమీపిస్తున్న కొద్దీ హిందూపురం వైసీపీలో టెన్షన్‌ మొదలైంది. నాలుగున్నరేళ్లుగా పార్టీని తన భుజాల‌పై మోసుకొచ్చిన నవీన్‌నిశ్చల్‌కు ఓ వర్గం చెక్‌పెట్టి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీని నెల‌న్నర్ర క్రితం పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించేలా చేసింది. అయితే ఆయన పార్టీలోకి వచ్చాక కొద్దిరోజుల‌ పాటు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. కానీ, కొద్దిరోజులుగా ఉన్నట్టుండి పార్టీ కార్యక్రమాల‌ జోరు తగ్గించారు. ఈ నేపథ్యంలో దూకుడు లేకపోతే టీడీపీని ఎదుర్కోలేమంటూ ఘనీ పరిస్థితిపై చర్చల‌కు తెర లేపారు. మరో మైనార్టీ నాయకుడిని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందని వైసీపీలోని ఓ వర్గం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు కర్ణాటకలోని సుంకుమ్మ గుడిని వేదికగా చేసుకున్నారు.  వైసీపీ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డితోపాటు మరికొంతమంది నాయకు అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఓ వర్గం నాయకు హాజరై.. అబ్దుల్‌ఘని పార్టీలోకి వచ్చాక మొదట దూకుడు ప్రదర్శించినా.. తరువాత పార్టీ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే చేపడుతున్నారని చర్చించినట్లు తెలిసింది. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా అన్నింటికీ సిద్ధపడే మరో అభ్యర్థిని తీసుకువద్దామని చర్చించారు. ‘పార్టీకోసం మనం ఎక్కడివరకైనా క ృషి చేయవచ్చు. కానీ టీడీపీని తట్టుకుని అందుకు తగ్గట్టుగా డబ్బు ఖర్చుపెట్టే విధంగా అభ్యర్థి ఉండాలి. అయితే అబ్దుల్‌ఘని డబ్బు ఖర్చు చేయడం లేదు. ఇలాగైతే టీడీపీని ఎలా డీకొడతాం’ అని పలువురు నాయకులు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. అబ్దుల్‌ఘనికి బదులుగా మరో మైనార్టీ నాయకుడిని తెరపైకి తీసుకొచ్చి టీడీపీని ఢీకొడదామని చర్చించినట్లు తెలిసింది. ఇక్కడ జరుగుతున్న విషయాల‌ను పార్టీ అధినేత జగన్‌ ద ృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెద్దామని పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దులో వైసీపీ నేతు నిర్వహించిన ఈ సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్త అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియడం లేదు.    ఈ సమావేశంలో ఓ వర్గం ఎత్తు, పైఎత్తు సఫలీక ృతం అవుతాయా లేక నవీన్‌నిశ్చల్‌నే మళ్లీ తెరపైకి తెస్తారా అనేది తేలాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa