ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 01:21 AM

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 4వ తేదీ సోమ‌వారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా సోమ‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవము(భోగితేరు), ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 12.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.   మార్చి 5వ తేదీన తెల్లవారుజామున 12.00 నుండి ఉదయం 4.00 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.  





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa