ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఒక రష్యన్ యువతి చేసిన హైడ్రామా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీఐపీ రోడ్డులో వేగంగా వెళ్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా.. కారు ఢీకొనడంతో ఓ యువకుడు కొంత దూరంలో ఎగిరిపడ్డాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఓ యువకుడు, రష్యన్ అమ్మాయి ఉండగా.. వారు బాగా మద్యం తాగి ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత రష్యన్ యువతి కారు నుంచి దిగి అక్కడ ఉన్న వారిపై తిట్ల దండకం అందుకుంది. అనంతరం అక్కడే ఉన్న పోలీసులపైనా విరుచుకుపడింది. స్థానికులపైనా దాడికి యత్నించి నానా హంగామా చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరిపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
![]() |
![]() |