ఎపీ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి సోమవారం తన పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు కార్యాలయానికి పంపారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే మరో మూడు రోజుల్లో వైకాపా అధినేత జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబుని కోరగా వచ్చే సారి అవకాశం ఇస్తానని బాబు చెప్పినప్పటికీ పార్టీని వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa