ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమయానికి తగిన గొడుగు పట్టడం చంద్రబాబుకి అలవాటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 09:11 AM

రాజకీయాల్లో తన ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మార్చే నాయకుడు ఒక్క చంద్రబాబేనని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నైజం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. రాజకీయాల్లో అధికారం తప్ప ఎటువంటి సిద్దాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం ఏ క్షణం ఎలా కావాలంటే అలా మాట్లాడగలిగే నైజం చంద్రబాబు సొంతమని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అమలువుతున్న చంద్రన్న పగ–దగా మాత్రమేనని అన్నారు. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూసినవే. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే  ఆశ్చర్యం కలుగుతోంది.


ఆయన గతాన్ని చాలా సులువుగా మార్చిపోతున్నారా? గతం గుర్తుండదా అనే సందేహం కలుగుతోంది. కేజ్రీవాల్‌ ఓటమిపై చంద్రబాబు మాట్లాడుతూ నరేంద్రమోదీని పొడగ్తలతో ముంచెత్తారు. సరైన సమయంలో.. సరైన నాయకత్వం ఈ దేశానికి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమైందంటూ ఆశాకానికి ఎత్తేశారు.  2019 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఇదే రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు. కేజ్రీవాల్‌ అంత గొప్ప నాయకుడు లేరని చంద్రబాబు ప్రకటిస్తే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఒక దిక్సూజీ అంటూ కేజ్రీవాల్‌ తనవంతు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాలుక మడతేసి నరేంద్రమోదీ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అంటూ భజన ప్రారంభించారు. కేజ్రీవాల్‌ ను 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి తీసుకువచ్చి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ’బాబుతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది’ అని కేజ్రీవాల్‌ విశాఖపట్నం ర్యాలీలో పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తే దానికి మద్దతు పలికింది కూడా ఇదే చంద్రబాబు. తనకు అనుక్షణం మద్దతు ఇచ్చే ఎల్లో మీడీయా అండతో ఏదైనా చెప్పగలను, ప్రజలను ఈ ఎల్లో మీడియా సాయంతో మభ్యపెట్టగలను అని నమ్మకంతో ఉన్నారు. తాను చాలా రాజనీతిజ్ఞడిని అని చెప్పుకునే చంద్రబాబు ఆనాడు నరేంద్రమోదీపై అతి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతున్నారు.ఇలా అవసరానికి ఒకలా మారడం బహుశా దేశ రాజకీయాల్లో చంద్రబాబుకే సాధ్యం అనిపిస్తుందని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa