చీరాల నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులకు అండగా ఉండి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌వీఎ్‌సఎ్‌సజేఆర్ ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆధునీకీరణలకు సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్నట్లు చెప్పారు. సమస్యలు నేరుగా ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్లో జరుగుతున్న ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa