కటక్ లో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ తో రాణించిన నేపథ్యంలో… సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్… తిలకించేందుకు ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు.. సాధించిన విజయం పై ప్రశంసలు కురిపించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ నియామకమైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత… టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో… స్టేడియంలో సరదాగా గడిపారు సీఎం మోహన్ చరణ్. రోహిత్ శర్మ అలాగే ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఇద్దరు కలిసి.. ఫోటోలు కూడా దిగారు. అయితే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అలాగే ప్లేయర్ లందరికీ నిన్న రాత్రి బిగ్ ట్రీట్ ఇచ్చారట ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్. రాత్రి ప్రత్యేకంగా ఒడిస్సా రుచులతో.. అందరికీ భోజనం ఏర్పాటు చేయించారట ముఖ్యమంత్రి మోహన్.
ఈ రాత్రి డిన్నర్ కు టీమ్ ఇండియా ప్లేయర్లు, అలాగే సిబ్బంది, కోచ్ గౌతమ్ గంభీర్ తదితరులు అందరూ హ్యాపీగా పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగానే ఒడిస్సా ప్రభుత్వం కూడా…. టీమిండియా ప్లేయర్లకు మంచి ట్రీట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఒడిస్సా రుచులు టెస్ట్ చేసిన తర్వాత… టీమిండియా ప్లేయర్లు అంతా చాలా బాగుందని సమాధానం ఇచ్చారట. ఇది ఇలా ఉండగా నిన్నటి రెండవ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది టీమిండియా. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 గెలుచుకుంది రోహిత్ శర్మ సేన.
Captain Rohit Sharma with Odisha CM Mohan Charan Majhi pic.twitter.com/zrzhN5LdWI
— TEJASH (@LoyleRohitFan) February 9, 2025
![]() |
![]() |