2014లో ఎదురైన భయమే.. 2019లోనూ వైసీపీను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. జయాపజయాల్లో కీలకమైన ఓట్ల తేడానే దీనికి కారణం. టీడీపీను ఎదుర్కొని నిలబడగల పార్టీగా వైసీపీనే జనం ఆమోదించారు. ఏపీలో ఈ మేరకు నాలుగేళ్లలో జగన్ బలం పుంజుకున్నారు. కానీ లక్షకోట్లరూపాయల అవినీతి మాత్రం వెంటాడుతూనే ఉంది. గ్రామీణప్రాంత ఓటర్లు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం అయితే మంచిదనే సానుకూలత వ్యక్తంచేస్తున్నారు. ఇకపోతే పట్టణ, నగరాల ఓటర్లు మాత్రం జగన్ గెలిస్తే మరోసారి అవినీతి పెరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన సర్వేలోనూ ఇదే విషయం బయటకురావటం ఫ్యాన్ రెక్కలకు చెమట పట్టిస్తున్నట్లు సమాచారం. టీడీపీ వ్యతిరేక ఓట్లు తమకే అనుకున్నప్పటికీ.. జనసేన ప్రభావం తో అవన్నీ గ్లాసు వైపు మళ్లే అవకాశాలను కొట్టేయలేమంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 2.06 శాతం మాత్రమే. కొన్నిచోట్ల కేవలం 500-1000 స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిన నేతలంతా పట్టణ, నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే కావటం విశేషం. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి.. అటువంటి వ్యతిరేకత వాతావరణం ఉండటం కూడా వైసీపీను గుబులు పుట్టిస్తుంది. ప్రభుత్వ పథకాలు ఈ సారి పట్టణ ఓటర్లను మరింత ప్రభావితం చేస్తాయని టీడీపీ గట్టిగా భావిస్తుంది. తమను ఈ సారి గెలిపించేది కూడా సంక్షేమ పథకాలనే ధీమా వ్యక్తంచేస్తోంది. మరి దీన్ని.. అధిగమించి.. పట్టణ ఓటర్ల మనసు గెలుచుకోవటం జగన్‌కు పెనుసవాల్‌గా మారిందనేది పార్టీ సీనియర్లూ అంగీకరిస్తున్న విషయం. పైగా. . ప్రజాశాంతిపార్టీ పేరుతో కేఏపాల్ కూడా క్రైస్తవుల ఓట్లను చీల్చే అవకాశాలున్నాయి. మరి.. ముప్పేట దాడిని తట్టుకుని.. అధికార పీఠం వైపు ఎలా కదలాలి అనేది మాత్రం వైసీపీ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేసే అంశమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa