ఎవరైనా సరే బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని..ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాలలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటారు. అయితే ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచించాడు ఓ యువకుడు. విప్రోలో సాఫ్ట్ వేర్ జాబ్ కు రిజైన్ చేసి తానే స్వతహాగా ఏమైనా చేయాలని భావించాడు. తానే సొంతంగా స్వయంగా ఉపాధి కల్పించుకోని, పలువుకికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన శివసాయి చరణ్. తన సొంత వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించి నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. అంతే తన దశ తిరిగింది. స్వయంగా ఎంచుకున్న కోళ్ల పెంపకంలో లాభాలు గడిస్తూ ఈ యువ ఇంజనీర్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కర్నూలులో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసిన శివసాయి చరణ్ బెంగళూర్ లోని విప్రోలో ఉద్యోగం పొందాడు. కానీ ఆ జాబ్ నచ్చక ఉద్యోగం కాస్త వదిలేసి సొంత ఊరికి చేరుకున్నాడు. నాటుకోళ్లకున్న డిమాండును తెలుసుకుని వాటి పెంపకానికి శ్రీకారం చుట్టాడు. రూ.20 లక్షల వ్యయంతో తన పొలంలోనే కోళ్ల షెడ్లు నిర్మించాడు. తమిళనాడు నుంచి మొదట రెండు వేల కోడి పిల్లలు తెప్పించి వాటి పెంపకం ప్రారంభించాడు. అలా తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చానంటూ శివసాయి చరణ్ తెలిపాడు. కోళ్ల పెంపకంతో పాటు వ్యవసాయంతో కూడా మరింత మందికి తనవంతుగా ఉపాది కల్పించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa