ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు నింపని ఉపాధి హామీ పథకం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 08:38 PM

 బతుకు దెరువు కోసం ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాల మొత్తాన్ని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
అందని వేతనాలు-గత ఏడాది డిసెంబర్‌ 2వ తేది నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు 25.14 లక్షల పని దినాలకు గాను రూ. 50,29,57,865 మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్‌ కాంపెనెంట్‌ కింద రూ. 103.85 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో పంచాయతీరాజ్‌ పనులకు రూ. 65.69 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీల వేతనాలు, మెటీరియల్‌ కాంపెనెంట్‌ మొత్తం రూ. 154 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
పట్టించుకోని ప్రభుత్వం -సాధారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు శనివారం వేతనాలను అందించాల్సి ఉంది. ఇప్పటికి అందకపోవడంతో కూలీల సంఖ్య 90 వేల నుంచి 65 వేలకు పడిపోయినట్లు సమాచారం. గత డిసెంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు వేతనాలు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నట్లు సమాచారం.  


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa