ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బు కోసం బాలుణ్ని కిడ్నాప్ చేసిన బాలిక..

Andhra Pradesh Telugu |   | Published : Mon, Mar 04, 2019, 10:22 PM

డబ్బు కోసం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ అక్రమాల బాట పడుతున్నారు. తాజాగా 17 ఏళ్ల ఓ బాలిక 11ఏళ్ల బాలుడిని  కిడ్నాప్ చేసి, అతడి తల్లికి ఫోన్ చేసి రూ.6 లక్షలు డిమాండ్ చేసింది. కలకలం రేపుతున్న ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో చోటు చేసుకుంది. టైలర్‌గా పనిచేస్తున్న ఓ తల్లి, తన కొడుకును శనివారం మధ్యాహ్నం ట్యూషన్‌కు పంపించింది. కొడుకు ఇంకా తిరిగి రాకపోవడంతో కంగారు పడింది. ఇంతలో ఆమెకు ఫోన్ వచ్చింది. ‘నీ కొడుకును కిడ్నాప్ చేశాను. రూ.6 లక్షలను ఓ బ్యాగులో తీసుకుని, భివాండీలోని శివాజీ చౌక్ వద్ద ఉండే ఓ బైకులో పెట్టి వెళ్లిపో. ఈ విషయం పోలీసులకు చెబితే.. నీ కొడుకు ప్రాణాలతో మిగలడు ’ అని  ఓ ఆడగొంతు బెదిరించింది.  ఏం చేయాలో దిక్కుతోచని ఆమె..   తన భర్త పని చేసే నగల దుకాణం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. అయితే ఆ షాపు వద్దే కొడుకు ఏడుస్తూ కనిపించాడు. ఏం జరిగిందిరా అని ప్రశ్నించింది. వాడు.. ‘నేను ట్యూషన్ కు వెళ్తుండగా ఓ మహిళ నన్ను కిడ్నాప్ చేసింది. నేను తప్పించుకుని ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు. తర్వాత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుు  కిడ్నాపర్ చెప్పినట్లే భివాండీలోని శివాజీ చౌక్ వద్దకు వెళ్లారు. కిడ్నాపర్ కోసం ఎదురు చూశారు. 17ఏళ్ల బాలిక బురఖా ధరించి రాగా అదుపులోకి తీసుకున్నారు. తాను బాలుడి తల్లి టైలర్ షాపులో తరచూ బట్టలు కుట్టించుకునేందుకు వెళ్తానని, వారి కుటుంబం గురించి మొత్తం తెలుసుకుని డబ్బుకోసం బాలుడ్ని కిడ్నాప్ చేశానని ఒప్పుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa