పదేళ్లకు పైగా అప్రతిహతంగా హస్తినను పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. 'యమునా' నది శాపం వల్లే 'ఆప్' ఓటమి పాలైనట్టు ఢిల్లీ మాజీ సీఎం అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం అతిషి తన రాజీనామాను సమర్పించేందుకు ఎల్జీని కలిశారు. ఈ సమయంలో ఎల్జీ అతిషితో మాట్లాడుతూ, యమునా నదిని శుభ్రపరచే ప్రాజెక్టును నిలిపివేయమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఇద్దరం కలిశామని, అప్పుడు యమునా శాపం గురించి ఆయనను హెచ్చరించారని, తన మాటను పెడచెవిన పెట్టారని అతిషితో సక్సేనా చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
![]() |
![]() |