తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేవనెత్తారు. ఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందని ఎంపీ పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారని ఎంపీ చెప్పారు. తిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారని తప్పుపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారని, ఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండు చేశారు.
![]() |
![]() |