మాడుగుల నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి మండలం వేచలం గ్రామంలో రామాలయం అభివృద్ధికి ఆ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి డ్వాక్రా సంఘం సభ్యులు 15, 116 రూపాయలు విరాళం అందజేశారు.
మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేసినట్టు సంఘ అధ్యక్షురాలు శ్రీనాథ్ వెంకటరజని, కార్యదర్శి మణి తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘ సభ్యులను కమిటీ ప్రతినిధులు అభినందించారు. భక్తుల సౌకర్యార్థం గుడిలో గంట ఏర్పాటు చేయాలని కోరారు.
![]() |
![]() |