వివో మొబైల్ ప్రియులకు డబుల్ గుడ్ న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V50 5G స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 17న భారతదేశంలో లాంచ్ కానుంది.ఈ మిడ్-బడ్జెట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌తో పాటు, కంపెనీ మరో కొత్త ఫోన్‌ను పరిచయం చేస్తుంది. Vivo T4x 5G ఫోన్‌ను కూడా భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల అంటే మార్చిలో ఈ ఫోన్‌ను విడుదల చేయచ్చు. ఈ కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వివో T4x 5G ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే, 8GB RAM + 128GB స్టోరేజ్, 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Vivo T4x 5G ఫోన్ మార్చి నెలలో భారత్‌లో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం కంపెనీ అధికారికంగా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. Vivo T4x 5G ధర సుమారు రూ. 15,000 ఉంటుందని తెలుస్తోంది. ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3x 5G ఫోన్ తరువాత కంపెనీ తయారు చేసిన ఫోన్ ఇదే.
ఇక Vivo T3x 5G ఫోన్ విషయానికొస్తే.. 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది. 2408 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 అక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో T3x 5G ఫోన్ దేశంలో 6000mAh లేదా 6500mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మొబైల్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత ఫోన్‌ను 23.33 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్, 18.55 గంటల ఇన్‌స్టాగ్రామ్ షాట్ వీడియో ప్లేబ్యాక్, 9.32 గంటల PUBG కోసం ఉపయోగించవచ్చని Vivo ప్రకటించింది.
Vivo T3x 5G ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 12,499కి విడుదల చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.15,499కి అందుబాటులో ఉంది. రాబోయే Vivo T4x 5G ధర కూడా అదే బడ్జెట్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |